logo
logo

క్రీస్తు ఘనపరచబడాలి

ఈ వెబ్‌సైట్‌ గురించి కొన్ని పరిచయ వాక్కులు, మరియు దీనిని ప్రారంభిచుటలో గల ఉద్దేశము.

  • Article by Joseph Livingston
    December 25, 2021
  • What is your goal in life?

    నన్ను ఎంతో మంది ఎన్నో సార్లు ఈ ప్రశ్న అడిగారు. ఒక స్థిరమైన జవాబు అప్పుడు నా దగ్గర లేదు. నా జవాబు మారుతూ వచ్చేది.

    ప్రియ సోదరి/సహోదరుడా, అదే ప్రశ్న నిన్ను అడిగితే నీ జవాబు ఏంటి? What is your goal in life?

    రకరకాల ఆశయాలు నిన్ను పరుగులు పెట్టిస్తుండవచ్చు; కాని, ఈ ప్రశ్నకు వాక్యము ఇచ్చె జవాబు ఒక్కటే: “క్రీస్తు ఘనపరచబడాలి!” (ఫిలిప్పి 1:19). ప్రభువుకు మహిమ తీసుకు రావడానికే నీవు సృష్టింపబడ్డావు. ఇంకొక ఉద్దేశం లేదు. క్రీస్తును ఘనపరచడం నీ జీవిత లక్ష్యంగా మారాలి.

    అందుకే ఈ వెబ్‌సైట్‌ని ప్రారంభిస్తున్నాము. మీ ఆత్మీయ ప్రయాణంలో ఒక సహకారిగా, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, దేవుని చేతిలో ఒక సాధనముగా ఈ వెబ్‌సైట్‌ వాడబడాలని మా నిరీక్షణ. “ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. (కొలొస్సయి 1:28,29).”

    స్వాగతం (Welcome):

    ఈ వెబ్‌సైట్‌కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇందులో ఉన్న ఐదు విభాగాలు (లేదా ఐదు పేజీలు) మీరు గమనించాలి.

    1. వ్యాసాలు (Articles): YouTube, Facebook ఇలాంటి వాటి వలన ఇప్పుడు సాహిత్యాన్ని మరచిపోతున్నారు. కాని, చదవడం అనే ప్రక్రియ మనకు ఎంతో మేలు చేస్తుంది. మనలో ఆలోచనాత్మక ధోరణిని పెంచుతుంది. కాబట్టి మీ ఆత్మీయ క్షేమము కొరకు వ్రాయబడుతున్న ఈ వ్యాసాలను (Articles) చదవండి.

    2. ప్రసంగాలు (Sermons): దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వినుటకు వేగిరపడాలి. ప్రకటించబడుతున్న వాక్యంతో సమానమైనది ఇంకొకటిలేదు. ఇది దేవుడు ఏర్పరచిన ఒక కృపా మాధ్యమము. దీని ద్వార దేవుని ఆత్మ, జ్ఞానము, ప్రేమ, శక్తి మనకు సమృద్ధిగా కలుగుతాయి.

    3. సువార్త (Gospel): ఈ పేజీలో క్రీస్తు సువార్తను వివరిస్తూ క్లుప్త సందేశాలు పొందుపరస్తున్నాము. మనమందరము సువార్త పరిచర్యలో పాలుపొందాలి. కాబట్టి, వీటిని వినండి మరియు ఇతరులకు పంచండి.

    4. పుస్తకాలు (Books): ఏదైన ఒక అంశాన్ని క్షుణ్ణంగా వివరించాలంటే పుస్తకాలు అవసరం. వ్యాసాల్లో (Articles) ఇది సాధ్యపడదు. సంఘ క్షేమాభివృద్ది కొరకు కొన్ని ప్రాముఖ్యమైన పుస్తకాలు, భక్తుల జీవిత చరిత్రలు, మొదలగునవి ఈ పేజీలో మీరు చూడవచ్చు.

    5. సంగీతం/పాటలు (Music): “Next to the Word of God, the noble art of music is the greatest treasure in the world” (Martin Luther); “దేవుని వాక్యం తరువాత సంగీతం/పాటలు ఈ లోకంలో ఒక గొప్ప సంపద,” అన్నారు మార్టిన్ లూథర్ గారు. ప్రభువు మహిమార్దమై క్రొత్త కీర్తనలు ఇక్కడ మీరు వినవచ్చును.

    Thank you for visiting this website. “గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్‌.” (హెబ్రి 13: 20,21).

    Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.

    Popular
    Books
  • John Bunyan (1628 – 1688)
  • యాత్రికుని ప్రయాణం

    ఆత్మీయ పోరాటమును, ప్రయాణమును, జాన్ బణ్యన్ గారు ఈ పుస్తకంలో అద్భుతముగా వివరించారు
    Sermon
  • Joseph Livingston
  • దేవుని లక్ష్యం

    Sermon
  • Paulson Vasala
  • ఆత్మలో మూలుగుచు మహిమ కొరకు నిరీక్షించుచు

    Life Eternal
    Unto God be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen.
    Contact Us | +91 9493994995, 8341119183All Rights Reserved.