ఊహాలకందని ఉన్నత లోకం
వర్ణింప శక్యం కాని మహిమ
24 పెద్దలు, కెరూబులు
లెక్కకుమించిన దూతలు
సింహాసనాలు, కిరీటాలు లేనివేళ
సమీపింపరాని తేజస్సులో
స్వయంభవుడు ఉండెను
కాలమన్నది కనుగొనకముందు
ఆది సంభూతుడు తండ్రితో
సమానుడై ఉండెను
భూమ్యాకాశాలు, నక్షత్ర తారలు
సూర్య, సౌర కుటుంబాలు
పాలపుంతలు, జీవరాసులను సృష్టించెను
రెక్కలొచ్చిన పక్షి
గూడును వీడినట్లు
పాపపరిహారం కోసం
పరిశుద్ధుడు పరలోకం విడిచెను
కన్య గర్భమందు
దైవ మానవునిగా అవతరించెను
గొఱ్ఱెపిల్లయై ప్రాణార్పణ చేసెను
పునరుత్థానంతో దేవునిగా నిరూపింపబడెను
మహా బలవంతుడు
భూపతులకు అధిపతి
రాజులకు రారాజు
ప్రభువులకు మహా ప్రభువు
సర్వలోక పూజార్హుడు
క్రీస్తు యేసే..
- పల్లె శాంతిరాజు.
Shanthi Raju Palle is a journalist and also the editor of Prakshalana, a christian monthly magazine.